అక్షరటుడే, వెబ్‌డెస్క్: Keesara Police Bribery | మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్‌గిరి జోన్, కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు, ఎస్సై ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.
కీసర పోలీస్ స్టేషన్ (Keesara Police Station)లో ఇప్పటికే నమోదైన కేసులో ఫిర్యాదిదారుడికి, అతని స్నేహితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం, వారిని వేధించకుండా ఉండటం కోసం సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రూ.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు సీఐ ఆదేశాల మేరకు ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి బుధవారం రాత్రి 11:25 గంటలకు ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో సోదాలు చేశారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
Keesara Police Bribery | జోరుగా అవినీతి
క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీస్ శాఖలో అవినీతి రాజ్యం ఏలుతోంది. పలువురు పోలీసులు ఫిర్యాదుదారులు, ఇతరుల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక మాఫియా, బెల్ట్ షాపుల నుంచి ప్రతి నెలా మామూళ్లు తీసుకునే పోలీసులు ఉన్నారు. ఇటీవల పలువురు పోలీసులు ఏసీబీకి చిక్కుతుండటం.. ఆ శాఖలో అవినీతికి అద్దం పడుతోంది. ముఖ్యంగా స్టేషన్ బెయిల్ విషయంలో పోలీసులదే తుది నిర్ణయం కావడంతో.. భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Food Safety | పాడైన చికెన్, మటన్‌తో వంటలు.. 9 హోటళ్ల లైసెన్స్‌లు రద్దు