Hyderabad Food Safety | పాడైన చికెన్​, మటన్​తో వంటలు.. 9 హోటళ్ల లైసెన్స్​లు రద్దు

హైదరాబాద్​ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్​ అధికారులు బుధవారం పెద్ద ఎత్తున దాడులు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Food Safety | హైదరాబాద్​ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై టీజీ సేఫ్ (TG SAFE)​ అధికారులు బుధవారం పెద్ద ఎత్తున దాడులు చేశారు. నిబంధనలు పాటించని 9 హోటళ్ల లైసెన్స్​లు రద్దు చేశారు.

ఎల్బీ నగర్‌లో టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. మొత్తం పది బృందాలు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు, ఆయిల్ ఫ్యాక్టరీలతో సహా 20 ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేశాయి. బొద్దింకలు, ఎలుకల బెడద, పాడైపోయిన మాంసం, గడువు ముగిసిన ఆహారం, మురికి వంటగదులు వంటి అనేక సమస్యలను అధికారులు గుర్తించారు. తనిఖీల్లో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో, బహర్​ బిర్యానీ కేఫ్​, హోటల్ సంగీత గ్రాండ్​, హోటల్ సింధూర ఈస్ట్​ కోర్టు, కినరా గ్రాండ్​, కెమిస్ట్రీ బార్​ సంస్థల ఎఫ్​ఎస్​ఎస్​ లైసెన్స్‌లను రద్దు చేసే ప్రక్రియ మొదలైంది.

 Hyderabad Food Safety | పాడైన చికెన్​ స్వాధీనం

దిల్​సుఖ్​ నగరలోని బహర్​ బిర్యానీ కేఫ్​లో అధికారులు పాచిపోయిన చికెన్, మటన్, రొయ్యలను గుర్తించారు. అలాగే ఎలుకల సంచారాన్ని గుర్తించారు. అక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు శాఖాహార, మాంసాహార పదార్థాలను వేరుగా ఉంచడంలో నిర్లక్ష్యం కనిపించింది. వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.పాడైపోయిన మాంసం, కూరగాయలు, పురుగులు పట్టిన ముడి సరుకులను ధ్వంసం చేశారు. భువనేశ్వరీ ఆయిల్​ ఇండస్ట్రీస్​లో రూ.5.5 లక్షల విలువైన 6,120 కిలోల వేరుశనగలు స్వాధీనం చేసుకున్నారు.

 Hyderabad Food Safety | నోటీసులు జారీ

కల్తీ పరీక్షల కోసం అధికారులు 20 నమూనాలను సేకరించారు. గెలాక్సీ కేఫ్ అండ్ రెస్టారెంట్, అంటేరా-నాగోల్, జాయింట్ అల్ మండి వంటి మరో ఏడు వ్యాపార సంస్థలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

దీనిని కూడా చదవండి : RTC Bus Accident | ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *