అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కురవి (Kuravi) మండలం లింగ్యతండాలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో పడి చనిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Mahabubabad | దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తండాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో బావిలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియడం లేదు. కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో ఆమె తన పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీనిని కూడా చదవండి : Illegal Liquor Seizure | అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ, డిఫెన్స్ మద్యం స్వాధీనం