Chandrayanpalli Road Accident | మూడు లారీలు, రెండు కార్లు ఢీ.. చంద్రయాణ్​పల్లి వద్ద ఘటన

ఇందల్వాయి మండలం చంద్రయాణ్ పల్లి శివారులో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Chandrayanpalli Road Accident | ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయాణ్ పల్లి శివారులో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే వరుసలో రోడ్డుపై మూడు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Chandrayanpalli Road Accident | భారీగా ట్రాఫిక్​ జామ్

కామారెడ్డి నుండి ఇందల్వాయి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు, డ్రైవర్లకు చిన్నపాటి గాయాల మాత్రమే అయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

acci

ఇది కూడా చదవండి: బతుకమ్మ స్పెషల్.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *