అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Rice Mill CMR Scam | జిల్లాలో (Nizamabad) సీఎంఆర్ ఇవ్వని రైస్‌మిల్లులపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నగర శివారులోని సాయి రాజలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లుపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు రూరల్ ఎస్‌హెచ్‌వో వివరాలు అందజేశారు.
Rice Mill CMR Scam | సివిల్ సప్లయ్.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..
నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలోని సాయి రాజలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో ఆగస్టు 13న పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. రబీ 2022-23 ఖరీఫ్ 2025-26 సీజన్లకు సంబంధించి మొత్తం 3,593.452 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ కొరత ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలు, పెనాల్టీ తదితర మొత్తాలు కలిపి రూ.8,34,48,130/- ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
మిల్లర్ రూ.70లక్షలు చెల్లించినప్పటికీ, సంబంధిత రికార్డుల ప్రకారం బకాయిలు రూ.కోట్లల్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి, ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి సీఎంఆర్ (CMR) బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా సదరు రైస్‌మిల్ ఇవ్వలేదు. దీంతో రైస్‌మిల్ మేనేజింగ్ పార్టనర్లు డి.హనుమంతరావు, డి. రాజేందర్‌లపై కేసు నమోదైంది. అలాగే ఈ లావాదేవీల్లో ఇతరుల పాత్రపై విచారణ చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు రవి ప్రకాష్, యాంకర్ ఉదయభాను, సంగీత దర్శకుడు ఆర్ఫీ పట్ నాయక్