అక్షరటుడే, వెబ్డెస్క్: Arikapudi Gandhi ED Notice | తెలంగాణ (Telangana)లో సంచలనం సృష్టించిన ‘సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్’ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. ఈ కుంభకోణానికి సంబంధించి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి ఈడీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 27న విచారణకు హాజరుకావాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
Arikapudi Gandhi ED Notice | లావాదేవీలపై ఈడీ ఆరా..
సాహితి ఇన్‌ఫ్రా సంస్థ నుంచి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఖాతాలకు సుమారు రూ.2.1 కోట్లు మళ్లించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ఈ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? వాటికి సరైన వ్యాపార కారణాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో అమాయక ప్రజల నుంచి భారీగా నిధులు వసూలు చేసిన సాహితి ఇన్‌ఫ్రా సంస్థ.. ఆ తర్వాత ఫ్లాట్లు, విల్లాలు ఇవ్వకుండా మోసం చేసింది. ప్రాజెక్టులు పూర్తి చేయలేదంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, ఆ కేసుల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది.
Arikapudi Gandhi ED Notice | భారీగా పెరిగిన కుంభకోణం విలువ..
తొలుత ఈ ప్రాజెక్టుల్లో రూ.248 కోట్ల మోసం జరిగినట్లు అంచనా వేయగా, తదుపరి దర్యాప్తులో ఈ కుంభకోణం విలువ ఏకంగా రూ.842 కోట్లకు చేరినట్లు ఈడీ తేల్చింది. సేకరించిన నిధులను సంస్థ ఎండీ బి.లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు తదితరులు తమ వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. 2018-2020 మధ్య కాలంలో రూ.50 కోట్లు నగదు రూపంలో తీసుకున్నట్లు, దాదాపు రూ.126 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఈడీ పేర్కొంది.
ఇప్పటివరకు తీసుకున్న చర్యలు..
బినామీ పేర్లతో కొనుగోలు చేసిన రూ.161 కోట్ల ఆస్తులను, ఆ తర్వాత మరో విడతలో రూ.12.6 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. నిందితులకు సంబంధించిన మొత్తం 56 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ సంస్థ ప్రకటనల్లో కనిపించిన టాలీవుడ్ నటుడు జగపతిబాబును సైతం ఈడీ సాక్షిగా విచారించింది. హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో ఇప్పటికే ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను కూడా దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి..: Osmania University Funds | ఓయూకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయి? ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం