అక్షరటుడే, వెబ్‌డెస్క్: 3 Kg Tumour Surgery | భారత వైద్య రంగంలో మరొక అరుదైన సంఘటన వెలుగు చూసింది. అహ్మదాబాద్ (Ahmedabad)కు చెందిన 11 ఏళ్ల చిన్నారిని వేధిస్తున్న ప్రాణాంతక సమస్యకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. గుండె కుడివైపునకు మారడం, ఏకంగా 3 కేజీల బరువున్న భారీ కణితిని తొలగించడం వైద్యవర్గాల్లో సంచలనంగా మారింది.
3 Kg Tumour Surgery | గుండె స్థానంలో మార్పు..
ఆ చిన్నారి చాలా కాలంగా తీవ్రమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో బాధపడుతోంది. వైద్య పరీక్షలు చేయించగా.. ఆమె గుండె సాధారణ స్థానం కంటే కుడివైపునకు మారినట్లు తేలింది. ఎక్స్-రే, సీటీ స్కాన్ ద్వారా పరిశీలించగా.. ఛాతీలో సుమారు 23 సెంటీమీటర్ల పరిమాణంతో ఏకంగా 3 కేజీల బరువున్న భారీ కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ భారీ కణితి కారణంగా ఊపిరితిత్తులపై తీవ్ర ఒత్తిడి పడి రక్తస్రావం కావడం, డయాఫ్రమ్ పూర్తిగా దెబ్బతిన్నది.
3 Kg Tumour Surgery | క్లిష్టమైన శస్త్రచికిత్స..
ప్రముఖ సర్జన్ డాక్టర్ మహేష్ డి.పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం ‘క్లామ్‌షెల్’ అనే అరుదైన పద్ధతిని ఉపయోగించి, కేవలం 3 గంటల్లోనే ఎంతో క్లిష్టమైన ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. కణితిని తొలగించిన వెంటనే ఊపిరితిత్తులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. క్రమంగా గుండె కూడా తన సహజ స్థానానికి చేరుకోవడంతో, వారం రోజుల్లోనే చిన్నారి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యింది.
ఇది కూడా చదవండి..: UPI MDR Petrol Pumps | పెట్రోల్ బంకుల్లో యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎండీఆర్ ఛార్జీల పై కేంద్రం కీలక అడుగు