RTC Strike | తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. ఆర్టీసీ కార్మికులకు సీఎం విజ్ఞప్తి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Strike | ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం వ్యాఖ్యలు చేశారు.

మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting)లో ఆర్టీసీ సమ్మెపై చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం కోరారు. ప్రాణాలు తీసుకుంటే సమస్య పరిష్కారం కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హామీ ఇచ్చారు. రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నేతృత్వంలో మంత్రులు భేటీ అవుతారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా, నిబద్ధతతో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

RTC Strike | చికిత్స పొందుతున్న శంకర్​గౌడ్​

రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రైవేట్​ డ్రైవర్లతో బస్సులు నడుపుతోంది. దీనికి నిరసనగా వరంగల్​ జిల్లా నర్సంపేట (Narsampet) డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కోలా శంకర్ గౌడ్ గురువారం ఒంటిపై పెట్రోల్​ పొసుకొని నిప్పు అంటించుకున్నాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే మంటలు ఆర్పి వేశారు. 85 శాతం కాలిన గాయాలతో శంకర్ గౌడ్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : TGSRTC Strike | ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి.. సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *