అక్షరటుడే వెబ్‌డెస్క్: Musi River Project | హైదరాబాద్ నగర ప్రక్షాళనతో పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( Revanth Reddy )అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ (MCRHRD) కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి హెచ్‌ఎమ్‌డీఏ (HMDA), జీహెచ్‌ఎమ్‌సీ (GHMC) కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Musi River Project | భూసేకరణ వేగవంతం..
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని త్వరగా పూర్తి చేసేందుకు భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో పారదర్శక నిబంధనలు రూపొందించుకోవాలని, ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్, అలాగే అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టమైన విధివిధానాలు తయారు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Musi River Project | ఫేజ్-2 టెండర్లు ..
మూసీ ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని, ప్రాజెక్టు నిర్మాణానికి తక్కువ వడ్డీకి లభించే రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. టీడీఆర్ (TDR) కేటాయింపులపై ప్రతి వారం సమీక్షలు జరగాలని సూచించారు. మూసీ పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా మంచిరేవులలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి తక్షణమే టెండర్లు పిలవాలని, కొత్వాల్‌గూడా బర్డ్స్ పార్క్‌కు ప్రచారం కల్పించి పర్యాటకులను ఆకర్షించాలని సీఎం ఆదేశించారు.
ఇది కూడా చదవండి: TNGO Dharna Nizamabad | 27న టీఎన్జీవోస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ధర్నా