అక్షరటుడే, వెబ్‌డెస్క్: Srisailam Project | శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో కంటే ఔట్ ఫ్లో అధికంగా ఉంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 45,192 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. కుడి గట్టు (Right Bank) కేంద్రంలో ఉత్పత్తి నిలిపి వేశారు. ప్రస్తుతం జలాశయం నుంచి 48,444 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది. ఇన్‌ఫ్లో కంటే ఔట్ ఫ్లో అధికంగా ఉండటంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టులో శుక్రవారం 16.4 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. శనివారానికి 166.7 టీంఎసీలకు తగ్గింది.
Srisailam Project | సాగర్‌కు కొనసాగుతున్న వరద
శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam)కు జూరాల నుంచి వరద వస్తోంది. అక్కడ విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదులుతున్న నాగర్జున సాగర్‌కు చేరుతోంది. ప్రాజెక్ట్‌కు వరద నిలకడగా కొనసాగుతోంది. దీంతో సాగర్ నీటిమట్టం నిలకడగా పెరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు పడి, కృష్ణానది ఉప్పొంగి పారితే సాగర్ నిండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Heavy Rains | రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి భారీ వర్షాలు