అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bomma Mahesh Kumar | హరీష్‌రావు (Harish Rao) తమిళనాడులో క్షుద్రపూజలు చేశారో..లేదో వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ (PCC Chief) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
Bomma Mahesh Kumar | తమిళనాడులో ఎందుకు పర్యటించారు?
తమిళనాడు పేరు వినగానే హరీష్‌రావు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో వివరించాలని బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. తమిళనాడులో ఆయన ఎందుకు పర్యటించారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని సమాచారం ఉందని అన్నందుకు నాతో పాటు మా పార్టీ నేతలకు లీగల్ నోటీసులు ఇచ్చారని.. క్షుద్ర పూజలకు ప్రసిద్ది చెందిన దేవాలయాల సందర్శన వెనకా మర్మం ఏమిటో హరీష్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
Bomma Mahesh Kumar | త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ
జిల్లా ప్రజలకు పీసీసీ చీఫ్ ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే నామినేటెట్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల నేతృత్వంలో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో వెళ్తోందని.. ఇటీవలే జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. లింబాద్రిగుట్ట పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు.
Bomma Mahesh Kumar | సీఎంఆర్ విషయంలో కఠినంగా..
జిల్లాలో సీఎంఆర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ కళాశాలలు 80 శాతం మంజూరయ్యాయని తెలిపారు. పామాయిల్ ఇండస్ట్రీతో మంచి దిగుబడి ఉంటుందని రైతులు ఈవైపు ఆలోచించాలని పేర్కొన్నారు. జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వర్షాభావం వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
కాళేశ్వరం నాణ్యత ఏమిటో బీఆర్ఎస్ నాయకులకు తెలుసు
కాళేశ్వరం నాణ్యత ఏమిటో బీఆర్ఎస్ నాయకులకు తెలుసని పీసీసీ చీఫ్ అన్నారు. నీటి తాకిడికి బ్యారేజీ ఉంటుందో.. ఊడుతుందో.. తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని కేంద్ర జలసంఘం సభ్యులే పేర్కొన్నారన్నారు. రూ.లక్షల కోట్లను గోదావరిలో పోశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్ పాదయాత్రతో ఎలాంటి ఉపయోగం లేదని..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగాసీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రైతు కమిషన్ సభ్యుడు గొడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: UPI Charges | యూపీఐ డిజిటల్ చెల్లింపుల ఖర్చు భరించాల్సిందే: ఆర్బీఐ గవర్నర్ aksharatodaynews.com/upi-charges-rb #UPI #RBI #SanjayMalhotra #DigitalPayments #AksharaToday