Tractor Trolley Accident | ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని యువకుడు దుర్మరణం

రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని బైక్​ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్ : Tractor Trolley Accident | రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని బైక్​ ఢీకొన్న (Road Accident) ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన భీమ్​గల్​ (Bheemgal) దేవక్కపేట వద్ద బుధవారం చోటు చేసుకుంది.

Tractor Trolley Accident | దేవక్కపేటలో..

​పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన గుగులోత్​ ప్రమోద్ తన బంధువైన గుగులోతు నరేందర్‌తో కలిసి దేవక్కపేటలోని చుట్టాల ఇంటికి వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన క్రమంలో దేవక్కపేట గ్రామ శివారులో రహదారిపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన ట్రాక్టర్ ట్రాలీని వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన ప్రమోద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన నరేందర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ట్రాలీని రోడ్డుపై నిలిపిన గంధం రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమ్​గల్​ ఎస్సై తిరుపతి తెలిపారు. రాత్రి వేళల్లో రోడ్లపై వాహనాలు నిలిపితే తప్పనిసరిగా రిఫ్లెక్టర్లు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: CJP Movement | సీజేపీని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన లేదు: అభిజీత్ దీప్కే

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *