Clay Ganesh Idol | నగరంలో మట్టిగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు మేయర్​ భూమిపూజ

నగరంలోని పోచమ్మ గల్లీలో మట్టిగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు మేయర్ కూరగాయల ఉమారాణి భూమిపూజ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Clay Ganesh Idol | నగరంలోని(Nizamabad) పోచమ్మ గల్లీలో మట్టిగణపతి (Eco Friendly Ganesh) విగ్రహ ప్రతిష్ఠాపనకు మేయర్ కూరగాయల ఉమారాణి భూమిపూజ నిర్వహించారు. రవితేజ యూత్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Clay Ganesh Idol | పర్యావరణహితం.. మట్టి గణపతి

మేయర్​ ఉమారాణి మాట్లాడుతూ..​ మట్టి గణపతి ప్రతిష్ఠాపన మన సంప్రదాయానికి, పర్యావరణానికి చాలా ముఖ్యమైనదన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో గణపతులు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయన్నారు. అవి కరిగిపోకుండా సరస్సులు, చెరువుల్లో మిగిలిపోయి జలచరాలకు హాని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. మట్టి గణపతి మాత్రం నీటిలో పూర్తిగా కరిగిపోయి పర్యావరణానికి ఎలాంటి నష్టం కలిగించదన్నారు.

ఇది మన పూర్వీకులు అనుసరించిన సహజమైన, పవిత్రమైన పద్ధతి అని.. మట్టితో తయారు చేసిన గణపతిని ఆరాధించడం ద్వారా మనం ప్రకృతితో మమేకమవుతామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని యువత ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందదాయకమని మేయర్​ పేర్కొన్నారు. రవితేజ యూత్ అసోసియేషన్ వారు అతి పెద్ద మట్టి గణపతిని ప్రతిష్ఠించడం ద్వారా మంచి సందేశం ఇస్తున్నారన్నారు. మున్సిపల్​ కార్పొరేషన్​ తరఫున పూర్తి సహకారం అందిస్తామని మేయర్​ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె‌స్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *