Nizamabad Railway Police | ప్రేమ విఫలమై.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

shashi kiran Mottala

అక్షర టుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Railway Police | రైలు కిందపడి (railway incident) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad)​ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది.

Nizamabad Railway Police | నగరంలోని హమాల్​వాడికి చెందిన..

రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హమాల్​వాడికి చెందిన అనిల్ ఫొటోగ్రాఫర్​గా పనిచేస్తున్నాడు. అతడు ఓ అమ్మాయిని ప్రేమించగా.. ఈ విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడో టౌన్​లో కౌన్సెలింగ్ సైతం నిర్వహించారు. అయితే అమ్మాయి తనకు దక్కదనే మనస్థాపంతో అనిల్ గురువారం కరీంనగర్ డెమో (Karimnagar Demo) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్​హెచ్​వో సాయి రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి: MLA Dhanpal | కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *