అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Operation Smile | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో (Nizamabad Police) బాల కార్మికులను అక్కున చేర్చుకునేందుకు ప్రత్యేకంగా ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అదనపు డీసీపీ(అడ్మిన్) శుభం ప్రకాశ్ అన్నారు. సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో బుధవారం ఆయన మాట్లాడారు.
Operation Smile | సీపీ ఆదేశాల మేరకు..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలోని తప్పిపోయిన, నిరాశ్రయులైన, వీధి బాలలు, బాల కార్మికులను రక్షించడమే లక్ష్యంగా సీపీ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అలాంటి చిన్నారులను గుర్తించి రక్షించడం, వారికి చట్టపరమైన సంరక్షణ కల్పించి వారి కుటుంబాల్లో తిరిగి చేర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జూలై 1 నుండి 31 వరకు నెల రోజులపాటు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, బాలల సంరక్షణ విభాగం తదితర విభాగాల సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు.
Operation Smile | ప్రధానంగా రైల్వేస్టేషన్లు.. బస్టాండ్లు..
ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు, హోటళ్లు, దాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని డీసీపీ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బాలలను గుర్తించి సంబంధిత అధికారుల సమక్షంలో పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు ప్రతి చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యం, రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ₹ 6,970 కోట్ల విలువైన 6-లేన్ల ద్వారకా సొరంగ మార్గ ప్రాజెక్టుకు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.