Mahesh Kumar Goud | డబుల్ బెడ్ రూంల పేరుతో మోసం చేసింది కేసీఆర్​ కాదా : పీసీసీ చీఫ్​

డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్​ ప్రజలను మోసం చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Mahesh Kumar Goud | రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసం చేసింది కేసీఆర్ కాదా అని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆర్మూర్ మండలం (Armoor Mandal) అంకాపూర్ గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు.

Mahesh Kumar Goud | ప్రతి బహిరంగ సభలో చెప్పి..

ఆయన మాట్లాడుతూ.. ప్రతి బహిరంగ సభలో డబుల్ బెడ్ రూమ్​ల గురించి చెప్పుకొచ్చిన కేసీఆర్ పదేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి మూడువేల ఇల్లు ఇస్తోందన్నారు. నాడు ప్రశాంత్ రెడ్డి ఎవరి పేరు రాస్తే వారికి డబుల్ బెడ్ రూమ్​లు ఇచ్చారని బెండకాయ పేరు రాస్తే బెండకాయకు బుడంకాయకు రాస్తే బుడంకాయకు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. తాము ఒక్క రూపాయి అవినీతి లేకుండా అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పల్లీలు, బఠానీలు పంచినట్లుగా పంచుకున్నారన్నారు.

Mahesh Kumar Goud | పదేళ్లు అధికారంలో ఉన్న ప్రశాంత్​రెడ్డి

పదేళ్లు అధికారంలో ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్​గల్​ ఆస్పత్రికి ఏం చేశారో చెప్పాలన్నారు. తాము రూ.3 కోట్లతో అభివృద్ధి చేశామని మిగిలిన పెండింగ్ బిల్లులు సైతం పది రోజుల్లో రానున్నట్లు తెలిపారు. భీమ్​గల్​లో కోర్టు ఏర్పాటు, లింబాద్రిగుట్టపై అతిథి గృహం, కొండగట్టు నుంచి బాసరకు రోడ్డు వెడల్పు ఇలా అన్నివిధాల అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గంను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష నాయకులు గోస పడ్డారని.. కేసీఆర్​ నియంతలా వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బీజేపీ బీఆర్ఎస్ అని చూడకుండా ప్రతి ఎమ్మెల్యేకు వారికి రావాల్సిన నిధులను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, కౌన్సిలర్లు నర్మే నవీన్, రవి గౌడ్, జితేందర్ రెడ్డి, గోనే దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Tummidihetti Barrage | కేంద్ర జల్‌శక్తి మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై కీలక చర్చ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *