అక్షరటుడే వెబ్‌డెస్క్: Tummidihetti Barrage | దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ఎత్తు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Tummidihetti Barrage | 150 మీటర్ల ఎత్తుతో ప్రయోజనాలు..
గతంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. అయితే, తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా దీనిని 150 మీటర్లకు పెంచేలా మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. బ్యారేజీ ఎత్తును 150 మీటర్లకు పెంచినప్పటికీ ముంపు ప్రాంతం కేవలం 1,000 హెక్టార్ల లోపే ఉంటుందని వివరించారు. ఈ ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే విద్యుత్ వినియోగంతో పనిలేకుండా, ఎలాంటి లిఫ్ట్‌ల అవసరం లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే నీటిని నిరాటంకంగా తరలించవచ్చని సీఆర్ పాటిల్‌కు సీఎం స్పష్టం చేశారు.
🟦ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు.
🟦ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీలు పాల్గొన్నారు.@revanth_anumula pic.twitter.com/olK1Uu9mKE— AIR News Hyderabad (@airnews_hyd) August 5, 2026
ఇది కూడా చదవండి: POCO M8 Power 5G | భారీ బ్యాటరీతో పోకో ఫోన్ విడుదల