SC ST Act verdict | కులం పేరుతో దూషించిన కేసులో నిందితులకు 5 ఏళ్ల జైలు

గ్రామ సర్పంచి, పెద్ద మనుషులు కలిసి బహిష్కరించడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా హింసిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: SC ST Act verdict | కుల పేరుతో దూషించడంతో పాటు సామాజిక బహిష్కరణకు పాల్పడిన ఘటనలో నిందితులకు నిజామాబాద్‌ Nizamabad లోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

SC ST Act verdict | అసలేం జరిగిందంటే..

డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దూస్‌గాం గ్రామానికి చెందిన గర్క సురేష్ ఆగస్టు 28, 2021న పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామంలోని 63 ఎస్సీ మాదిగ కుటుంబాలను గ్రామ సర్పంచి, పెద్ద మనుషులు కలిసి బహిష్కరించడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా హింసిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్పందించిన డిచ్‌పల్లి పోలీసులు క్రైమ్ నంబర్ 179/2021 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో దూస్‌గాం గ్రామానికి చెందిన A1 మంద లక్ష్మణ్ (మున్నూరు కాపు), A3 మంద మోహన్, A4 మంద రాజయ్య, A5 శివాయోల్ల శివ రెడ్డి, A6 గంగారెడ్డిలు నేరానికి పాల్పడినట్లు పక్కా సాక్ష్యాధారాలతో రుజువయింది.

SC ST Act verdict | న్యాయస్థానం తీర్పు..

ఈ కేసుకు సంబంధించి నిజామాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో (స్పెషల్ ఎస్సీ నంబర్ 81/21) నేడు (నవంబర్ 4, 2026) న్యాయమూర్తి ఎస్. నారాయణ తీర్పు వెల్లడించారు.

నిందితులపై నేరం రుజువు కావడంతో Sec 3(1)(r)(s) of SC/ST Act ప్రకారం 5 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, రూ. 5,000/- జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

SC ST Act verdict | ఎస్పీ ఏమన్నారంటే..

ఈ కేసులో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ R. దయాకర్ గౌడ్ బలమైన వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఎస్సై బి. ఆంజనేయులు, దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన అప్పటి నిజామాబాద్ ఏసీపీ A. వెంకటేశ్వర్ తదితరులు కీలక పాత్ర పోషించారు.

అలాగే విచారణలో సమన్వయం అందించిన డిచ్‌పల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ MD. ఆరిఫ్, కోర్టు లైజన్ ఆఫీసర్ టి. గోవింద్, కోర్టు కానిస్టేబుల్ పి. ప్రశాంత్, సీఎంఎస్ కానిస్టేబుళ్ల విధి నిర్వహణను అధికారులు అభినందించారు.

నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులను, సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ P. సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు. కులం పేరుతో దూషించేవారిపై, నేరాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *