Indira Mahila Shakti Bhavan | జూన్​ 2లోగా ఇందిరా మహిళా శక్తి భవనాన్ని అప్పగించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indira Mahila Shakti Bhavan | ఇందిరా మహిళా శక్తి భవనం పనులు వేగంగా పూర్తిచేసి జూన్​ 2లోగా అప్పగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (collector ila tripathi) అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్​ సమీపంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన భవన సముదాయాన్ని గురువారం ఆమె సందర్శించారు.

Indira Mahila Shakti Bhavan | తుదిదశకు చేరుకున్న పనులు

తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులను, వాటి నాణ్యతను కలెక్టర్ (nizamabad collector)​ పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని, జూన్ 2వ తేదీ లోపు భవన సముదాయాన్ని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి భవనం చుట్టూ ప్రహరీ నిర్మించాలని సూచించారు. పనులను నాణ్యతతో పూర్తి చేయించి, సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ భవనం దోహదపడనున్నందున ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సాయన్న, జిల్లా పంచాయతీరాజ్ అధికారి బావయ్య, ఈఈ వీరానంద్, మెప్మా ఏపీడీ మధుసూదన్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి:Tirumala Devotee Rush | తిరుమలలో పెరిగిన రద్దీ.. రేపటి వరకు క్యూలైన్లకు రావొద్దని విజ్ఞప్తి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *