Shabbir Ali Audio | షబ్బీర్ అలీ వాయిస్‌ రికార్డుల వ్యవహారంపై విచారణ జరపాలి

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పేరుతో వచ్చిన వాయిస్‌ రికార్డింగ్‌లపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఈ మేరకు శనివారం ఎస్పీ రాజేష్​ చంద్రకు వినతిపత్రం అందజేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali Audio | ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ(Shabbir Ali) పేరుతో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న వాయిస్‌ రికార్డింగ్‌లపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు. ఈ మేరకు ఎస్పీ రాజేష్​ చంద్రకు(SP Rajesh Chandra) శనివారం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి(Kamareddy) పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఐరేని సందీప్‌ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌ రెడ్డి నేతృత్వంలో పలువురు నాయకులు ఎస్పీ, డీఎస్పీ, టౌన్‌ ఎస్‌హెచ్‌వోలను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

Shabbir Ali Audio | వాయిస్​ రికార్డ్​లు పూర్తి ఫేక్​..

షబ్బీర్‌ అలీకి సంబంధించినవిగా చెబుతూ యూట్యూబ్, వాట్సాప్‌ గ్రూపులు, కొన్ని మీడియా సంస్థల్లో ప్రసారమవుతున్న ఆడియోలు పూర్తిగా ఫేక్‌ అని వారు స్పష్టం చేశారు. ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కుట్రపూరితంగా వీటిని సృష్టించారని ఆరోపించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధస్సు సాంకేతికతతో వాయిస్‌లను మార్ఫింగ్‌ చేయడం, ఎడిట్‌ చేయడం సులభమైందని, అందువల్ల ఆ ఆడియోల ప్రామాణికతను ఫోరెన్సిక్‌ పరీక్షల ద్వారా శాస్త్రీయంగా తేల్చాలని నేతలు డిమాండ్‌ చేశారు. వైరల్‌ అవుతున్న ఆడియోల మూలాలను గుర్తించి, అసలు ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని కోరారు.

Shabbir Ali Audio | తప్పుడు ఆడియోలు సృష్టించి..

తప్పుడు ఆడియోలు సృష్టించి ప్రచారం చేసిన వ్యక్తులపై, నిర్ధారణ కాకుండానే పదేపదే ప్రసారం చేసి ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా నిర్వాహకులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణ పూర్తయ్యే వరకు అనుమానాస్పద ఆడియోలను ప్రచారం చేయకుండా చూడాలని, ఈ వ్యవహారంలో కుట్ర, పరువు నష్టం, ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూడెం శ్రీనివాస్‌ రెడ్డి, పాత రాజు, పండ్ల రాజు, గుడుగుల శ్రీనివాస్, రాజా గౌడ్, చాట్ల రాజేశ్వర్, భూమని బాలరాజు, ఇప్ప శ్రీనివాస్, సుధాకర్‌ రెడ్డి, సలీం, మీసాల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

shabbir ali 1

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *