అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS Jagan Comments | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ (Harikrishna) చనిపోతే పరామర్శకు వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)తో పొత్తుల గురించి చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. శవాన్ని పక్కనపెట్టుకొని పొత్తుల గురించి మాట్లాడిన నీది శవ రాజకీయం కాదా అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ గురువారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎవరైనా ఏదైనా అంశం మీద ప్రశ్నిస్తే.. తన మీద, వైసీపీ మీద అడ్డగోలుగా ఆరోపణలు చేసి టాపిక్ డైవర్ట్ చేస్తారన్నారు. ఇటీవల చంద్రబాబు బీపీ పెరగడానికి మావిగన్ కారణం అన్నారు. తాము ప్రతిపాదించిన మావిగన్‌కు ప్రజల నుంచి మద్దతు ఉందన్నారు. దీంతో దానికి సమాధానాలు చెప్పలేక తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతోందని విమర్శించారు. చంద్రబాబు నిద్రలో ఉన్నప్పుడు మావిగన్ అని ఎవరైనా చెప్తే.. బహుశా గుండె ఆగి చనిపోతారని పేర్కొన్నారు.
YS Jagan Comments | బాలకృష్ణ ఇద్దరిని కాల్చి చంపారు
చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ (Balakrishna) గన్‌తో ఇద్దరిని కాల్చిపడేయలేదా అని జగన్ ప్రశ్నించారు. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదని వాచ్‌మెన్‌ను బండచితో కొట్టి చంపారన్నారు. మరి ఎవరిది గన్ కల్చర్ అన్నారు.
YS Jagan Comments | రాష్ట్రంలో అవినీతి పాలన
రెండేళ్లలో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని జగన్ అన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌గా మార్చేశారని, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారని ఆరోపించారు.
YS Jagan Comments | రూ.47 వేల కోట్ల అప్పు
అమరావతి కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.47, 387 కోట్ల అప్పు చేసిందని జగన్ అన్నారు. ఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలిపారు. స్కామ్‌ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019కు ముందు చంద్రబాబు ఏ కంపెనీలకు ఏ పనులైతే ఇచ్చాడో..2024లో టెండర్లు రద్దుచేసి పిలిచిన తర్వాత మళ్లీ అవే కంపెనీలకు అవే పనులు ఇచ్చారని ఆరోపించారు.
చంద్రబాబు బావమరిది బాలకృష్ణ గన్‌తో ఇద్దరిని కాల్చిపడేయలేదా..?
ఆ తరువాత సాక్షులు ఉండకూడదని వాచ్‌మెన్‌ను బండచితో కొట్టి చంపలేదా..?
మరి ఎవరిది గన్ కల్చర్ చంద్రబాబూ..?
– మాజీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/SfeYzRrpNr
— Telugu Feed (@Telugufeedsite) May 21, 2026
దీనిని కూడా చదవండి : Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం


