Croma Independence Day Sale | క్రోమా ‘ఇండిపెండెన్స్ డే సేల్’.. హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్ పై భారీ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు!

టాటా గ్రూప్‌నకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆమ్నీ-ఛానల్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ 'క్రోమా' (Croma) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన 'ఇండిపెండెన్స్ డే సేల్'ను ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Croma Independence Day Sale | టాటా గ్రూప్‌నకు ( Tata group )చెందిన భారతదేశపు ప్రముఖ ఆమ్నీ-ఛానల్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ ‘క్రోమా’ (Croma) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ‘ఇండిపెండెన్స్ డే సేల్’ను ప్రారంభించింది. హైదరాబాద్ వేదికగా ప్రకటించిన ఈ సేల్‌లో హోమ్ అప్లయన్సెస్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ , రకరకాల సాంకేతిక ఉత్పత్తులపై విస్తృత శ్రేణి ఆఫర్లను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లు ఆగస్టు 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

Croma Independence Day Sale | ఆకర్షణీయ డీల్స్..

వినియోగదారులు తమ ఇళ్లను సరికొత్త ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వీలుగా టీవీలు, రెఫ్రిజరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, కిచెన్ అప్లయన్సెస్, హోమ్ ఆడియో, ఎయిర్ ప్యూరిఫైయర్లు , వ్యాక్యూమ్ క్లీనర్లపై ఫ్లాట్ 20% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో భాగంగా శామ్‌సంగ్ 75” నియో క్యూఎల్ఈడీ (Neo QLED) 8K టీవీపై అత్యధికంగా 60% వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే 55 ఇంచుల వరకు ఏ టీవీ కొనుగోలు చేసినా ఎల్‌జీ సౌండ్‌బార్ S40T కేవలం రూ. 10,990 కే పొందవచ్చు. 8 కేజీల టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ. 21,700 నుండి , 436 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజరేటర్లు రూ. 43,790 నుండి ప్రారంభమవుతున్నాయి.

Croma Independence Day Sale | క్రెడిట్ కార్డ్‌లతో మరింత ఆదా ..

స్వాతంత్ర్య దినోత్సవ పొదుపును మరింత రెట్టింపు చేస్తూ, క్రోమా రూ పే (RuPay) క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అదనపు లబ్ధిని చేకూరుస్తోంది. ఏ బ్యాంక్ రూ పే కార్డ్ అయినా సరే, కొనుగోలు విలువ ఆధారంగా తక్షణ డిస్కౌంట్లు లభిస్తాయి. ఫుల్ స్వైప్‌పైరూ. 5,000 కొనుగోలు నుండి రూ. 250 డిస్కౌంట్ ప్రారంభమవ్వగా, EMI పై రూ. 20,000 కొనుగోలు నుండి రూ. 1,250 వరకు డిస్కౌంట్లు ఉంటాయి. దీనికి తోడు టాటా న్యూ (Tata Neu) క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 5% వరకు న్యూకాయిన్స్ (NeuCoins) లభిస్తాయి.

Croma Independence Day Sale | ల్యాప్‌టాప్ ప్రియుల కోసం సూపర్ ఆఫర్లు..

ల్యాప్‌టాప్‌లు , టాబ్లెట్‌లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం కూడా క్రోమా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. విండోస్ ల్యాప్‌టాప్‌లపై విద్యార్థులకు 10% వరకు ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M5 నెలకు రూ. 5,621 సులభమైన EMI తో, ఐప్యాడ్ (11th Gen) నెలకు రూ. 1,939 EMI తో లభ్యమవుతున్నాయి. స్నాప్‌డ్రాగన్ ల్యాప్‌టాప్‌లపై రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై రూ. 32,000 విలువైన AI గ్లాసెస్ ఉచితంగా లభిస్తాయి.

Croma Independence Day Sale | స్మార్ట్‌ఫోన్‌లపై పండగ ఆఫర్లు ..

లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను టాటా న్యూ రివార్డులు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో అత్యంత సరసమైన ధరలకే అందిస్తున్నారు. వివో X300 FE ఫోన్ రూ. 51,800 నుండి, గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ రూ . 67,999 నుండి, ఐఫోన్ 17 ప్రో రూ. 75,900 నుండి ప్రారంభమవుతున్నాయి. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ శ్రేణిపై రూ. 5,990 విలువైన సోనీ హెడ్‌ఫోన్స్ , రూ. 8,800 విలువైన అమెరికన్ టూరిస్టర్ కొలరాడో బ్యాగ్ ఉచితంగా లభిస్తాయి.

ఇది కూడా చదవండి:  Paddy Farmers | వరి సాగు చేసిన రైతులు రిజిస్ట్రర్​ చేసుకోవాలి : మంత్రి తుమ్మల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *