Gandhi Organ Transplant | ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్.. మదర్ మిల్క్ బ్యాంక్‌.. ప్రభుత్వ వైద్య విప్లవానికి నేడు శ్రీకారం!

Naresh Chandan
Gandhi Organ Transplant

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gandhi Organ Transplant | హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. Gandhi Hospitalలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి Damodar Rajanarasimha శుక్రవారం ప్రారంభించనున్నారు.

Gandhi Organ Transplant | సౌత్‌వెస్ట్ బ్లాక్‌లో

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రోత్సహించడంతో పాటు, ప్రజలకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సెంటర్‌ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు. గాంధీ హాస్పిటల్ 8వ అంతస్తులోని సౌత్‌వెస్ట్ బ్లాక్‌లో సుమారు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు.

ఈ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌లో లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, ఎండోకాక్లియర్ ఇంప్లాంట్స్, మోకాలి మార్పిడి వంటి ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇందుకోసం 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, అనుసంధాన ఆడిటోరియం, 3 ట్రాన్స్‌ప్లాంట్ ఐసోలేషన్ గదులు, 25 పడకల సామర్థ్యంతో 3 ఐసీయూలు, సర్జన్లు, అనస్థీషియా నిపుణుల కోసం ప్రత్యేక లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ల తరలింపునకు ప్రత్యేక లిఫ్ట్ కూడా అందుబాటులో ఉంచారు.

Gandhi Organ Transplant | అంతర్జాతీయ ప్రమాణాలు

అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్, పవర్ బ్యాకప్ కోసం జనరేటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా, ఇన్‌ఫెక్షన్ నియంత్రణకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ 9 ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ల ద్వారా 24 గంటలపాటు శుభ్రమైన గాలి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

ఈ కేంద్రం ప్రారంభంతో రాష్ట్రంలో అవయవ మార్పిడి సేవలు విస్తరించి, అత్యవసర చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడే అవసరం తగ్గుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే తరహాలో Telangana Institute of Medical Sciencesలో కూడా ఆధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలు వృథా కాకుండా జిల్లాల వారీగా ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Gandhi Organ Transplant | మదర్ మిల్క్ బ్యాంక్‌

ఇదే సందర్భంలో గాంధీ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్‌ను కూడా మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో తల్లిపాల సేకరణ, నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేసి, అవసరమైన శిశువులకు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. Dhatri సంస్థ సహకారంతో ఈ మదర్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.

TIMS Sanathnagar Trial | టిమ్స్​లో ట్రయల్ రన్.. రేపటి నుంచి ఓపీ సేవలు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *