అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bathukamma Celebrations | బతుకమ్మ సంబరం ఖండాంతరాలు దాటింది. తెలంగాణ రాష్ట్రానికే అత్యంత ప్రత్యేకమైన ఈ పండుగను తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మన ఆడపడుచులు సగర్వంగా తెలంగాణ (Telangana) సంస్కృతీ సంప్రదాయాలను దశదిశలా చాటుతున్నారు.
Bathukamma Celebrations | సెయింట్ లూయిస్‌లో..

అమెరికాలోని సెయింట్ లూయిస్ సిటీలో బ్రోమిన్ సిక్ పార్క్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ సెయింట్ లూయీస్ ఆధ్వర్యంలో తెలంగాణ పూలపండగైన బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, నిజామాబాద్ ఇతర జిల్లాకు చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నవారికి బహుమతులు అందజేశారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Transport Department | రవాణాశాఖ అవినీతిపై నెట్టింట వైరల్.. డీటీసీ దుర్గా ప్రమీల కీలక ఆదేశం