Classic Legends Bikes | జావా, యెజ్డీ, బిఎస్‌ఎ రీ-ఎంట్రీ ప్రయాణం.. క్లాసిక్ లెజెండ్స్ అపూర్వ విజయం..

జావా, యెజ్డీ బ్రాండ్లను భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు చాలామంది రైడర్లు, సేకకర్తలు ఆయా బ్రాండ్ల వారసత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Classic Legends Bikes |జావా, యెజ్డీ బ్రాండ్లను భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు చాలామంది రైడర్లు, సేకకర్తలు ఆయా బ్రాండ్ల వారసత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ‘క్లాసిక్ లెజెండ్స్’ (Classic Legends) సంస్థ ఈ దిగ్గజ బ్రాండ్లను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Classic Legends Bikes |జావాతో మొదలైన పునరుద్ధరణ..

నవంబర్ 15, 2018న అనుపమ్ థరేజా, బొమన్ రుస్తమ్ ఇరానీల ఆధ్వర్యంలో క్లాసిక్ లెజెండ్స్ సంస్థ జావా బ్రాండ్‌ను రీ-లాంచ్ చేసింది. జావా 350, జావా 42, పెరాక్ (  Perak ) మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. లాంచ్ అయిన మొదటి రోజే ఈ బ్రాండ్‌కు భారీ స్పందన లభించడంతో పాటు డీలర్‌షిప్‌లను కూడా త్వరగా విస్తరించారు.

2020–2021: కరోనా సవాళ్లు..
ఈ ప్రయాణం సాగుతున్న సమయంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా తయారీ మరియు సరఫరా వ్యవస్థలకు కొంత అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కంపెనీ పంపిణీ వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగింది.

2022: యెజ్డీ బైకుల పునరుగమనం..
1971 నాటి ప్రసిద్ధ ‘యెజ్డీ’ బ్రాండ్ 2022లో రోడ్‌స్టర్స్, స్క్రాంబ్లర్స్, అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ రూపంలో తిరిగి వచ్చింది. ఈ మోడళ్లు యువతను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యాయి.

2023: రైడర్ల సంఘాలు , కమ్యూనిటీల విస్తరణ..
2023 నాటికి ఇదొక పెద్ద రైడర్ కమ్యూనిటీగా మారింది. అంతర్జాతీయ జావా-యెజ్డీ దినోత్సవంలో వేలాది మంది అభిమానులు పాల్గొనడం విశేషం. ‘నోమాడ్స్ కమ్యూనిటీ’ ద్వారా రైడర్లు ఒకరితో ఒకరు అనుసంధానమయ్యే వేదిక ఏర్పడింది.

2024: బిఎస్‌ఎ (BSA) బైకుల ప్రవేశం..
బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ‘బర్మింఘమ్ స్మాల్ ఆర్మ్స్’ (BSA) మోటార్ సైకిల్ విభాగాన్ని 2024లో భారత్‌లోకి తెచ్చారు. మోడ్రన్ క్లాసిక్ ‘గోల్డ్ స్టార్ 650’ (Gold Star 650) బైక్‌ను విడుదల చేయడం ద్వారా జావా, యెజ్డీ, BSA అనే మూడు బ్రాండ్లు క్లాసిక్ లెజెండ్స్ పోర్ట్‌ఫోలియోలోకి చేరాయి.

Classic Legends Bikes | భవిష్యత్తు ప్రణాళికలు..

ప్రస్తుతం క్లాసిక్ లెజెండ్స్ సంస్థ మంచి వృద్ధిని సాధిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2026లో దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి వృద్ధి రేటును నమోదు చేసింది. 2026 చివరి నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 2,00,000 బైకులకు పెంచాలని, 2028 నాటికి సేల్స్ & సర్వీస్ కేంద్రాలను 700లకు పైగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: Maoist Dump Seized | కర్రెగుట్టల్లో మావోయిస్ట్​ డంప్​ స్వాధీనం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *