Robotic Laparoscopic Surgery | అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలతో మెరుగైన ఫలితాలు

ఆధునిక వైద్యరంగంలో శస్త్రచికిత్స విధానాల్లో వస్తున్న మార్పులు చికిత్సలను సులభతరం చేస్తున్నాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ మూడద్ల పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Robotic Laparoscopic Surgery | ఆధునిక వైద్యరంగంలో శస్త్రచికిత్స విధానాల్లో వస్తున్న మార్పులు చికిత్సలను సులభతరం చేస్తున్నాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ (Yashoda Hospitals) సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ మూడద్ల పేర్కొన్నారు. నగరంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

​Robotic Laparoscopic Surgery | జీర్ణకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో..

​జీర్ణకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఈ ఆధునిక విధానాల ప్రాముఖ్యతను డాక్టర్ సుధీర్ వివరించారు. ఆహారనాళం, కడుపు, కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి, చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళానికి సంబంధించిన అనేక వ్యాధులకు అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హై-డెఫినిషన్ 3డీ (3D) విజువలైజేషన్, అత్యాధునిక పరికరాలు, మెరుగైన కదలికల సామర్థ్యం కలిగిన సాంకేతికతతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం చిన్న కోతల ద్వారానే మరింత కచ్చితత్వంతో చేయడం సాధ్యమవుతోందన్నారు.

Robotic Laparoscopic Surgery |​ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీతో ప్రయోజనాలివే..

​అతిచిన్న కోతలతోనే శస్త్రచికిత్స పూర్తవుతుందని.. ​శస్త్రచికిత్స అనంతరం రోగులకు నొప్పి గణనీయంగా తగ్గుతుందని ఆయన వివరించారు. ​నేటి ఆధునిక శస్త్రచికిత్స అంటే కేవలం చిన్న కోతలకే పరిమితం కాదని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన సర్జన్ల నైపుణ్యం, రోగి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ మెరుగైన వైద్య ఫలితాలను సాధించడమే దీని ప్రధాన లక్ష్యమని డాక్టర్ సుధీర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్‌లో అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తూ, క్లిష్టమైన జీర్ణకోశ వ్యాధులకు సురక్షితమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: నిజామాబాద్ లో కాంగ్రెస్ మేనిఫెస్టోను చించేసిన బీఆర్ఎస్ నాయకులు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *