Harish Rao Challenge | దమ్ముంటే సిద్దిపేట నుంచి పోటీ చేయు.. సీఎంకు హరీశ్​రావు సవాల్​

సీఎం రేవంత్​రెడ్డికి దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలని హరీశ్​ రావు సవాల్ విసిరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao Challenge |సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy)కి మాజీ మంత్రి హరీశ్​రావు సవాల్ చేశారు. ఆయనకు దమ్ముంటే తనపై సిద్దిపేటలో పోటీ చేయాలన్నారు.

సిద్దిపేటలో సీఎం గురువారం సభ పెట్టిన విషయం తెలిసిందే. హరీశ్​రావుపై అనేక ఆరోపణలు చేసిన ఆయన, సిద్దిపేట కాంగ్రెస్​ అడ్డా అన్నారు. ఆయన వ్యాఖ్యలకు తాజాగా హరీశ్​రావు కౌంటర్​ ఇచ్చారు. ‘దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున నా మీద పోటీ చెయ్’ అన్నారు. అప్పుడు ఎవరు గెలుస్తారో చూసుకుందామని పేర్కొన్నారు. అసెంబ్లీ పెట్టి తన మైక్ కట్ చేయకుండా ఉంటే, తెలంగాణకు రేవంత్​రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తాను అన్నారు.

Harish Rao Challenge | రేవంత్​రెడ్డి ఒక కోవర్ట్​

రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్ అని హరీశ్​రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్, వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ రేవంత్​రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా పాలమూరుకు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, క్రాప్ హాలిడే లేకుండా 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చిన్న పని పూర్తి చేస్తే 50 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు అన్నారు. కానీ ఆ పని చేయకుండా నీళ్లను కిందకు వదిలేసిన ద్రోహి రేవంత్ అని ఆరోపించారు.

Harish Rao Challenge | సొంత పార్టీ ఎమ్మెల్యేలను..

సొంత పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్‌ రెడ్డి తీరు పై అసంతృప్తితో నిజాలు మాట్లాడితే వారిని కూడా పిచ్చి కుక్కలని అంటున్నారని హరీశ్​రావు విమర్శింంచారు. ఆ ఎమ్మెల్యేలు లేకపోతే రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కూడా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్​రెడ్డిని ప్రజలు పండబెట్టి తొక్కుతారన్నారు.

ఇది కూడా చదవండి..: Godavari Water Supply | తుది దశకు గోదావరి జలాల తరలింపు పనులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *