Cable Lineman Electric Shock | స్తంభంపై కేబుల్ టీవీ​ లైన్​మన్​కు కరెంట్ షాక్​

స్తంభం ఎక్కి కేబుల్​ వైర్లను సరిచేస్తుండగా విద్యుత్​షాక్​ తగిలి లైన్​మన్​కు గాయాలయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Cable Lineman Electric Shock | స్తంభం ఎక్కి కేబుల్​ వైర్లను సరిచేస్తుండగా విద్యుత్​షాక్​ తగిలి లైన్​మన్​కు గాయాలయ్యాయి. ఈ ఘటన నగరంలోని (Nizamabad) ముబారక్​నగర్​లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

Cable Lineman Electric Shock | ముబారక్​నగర్​లో..

నగరంలోని ముబారక్​నగర్​లో పెద్దమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో ఓ స్తంభంపై కేబుల్​ టీవీ లైన్​మన్​ కేబుల్​ వైర్లు సరి చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు స్తంభంపై విద్యుత్​వైర్లకు తగలడంతో షాక్​కు గురై కిందపడ్డాడు. దీంతో అతడి చేతికి గాయాలయ్యాయి. రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరగడంతో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుడిని జీజీహెచ్​కు తరలించారు.

ఇది కూడా చదవండి: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *