అక్షరటుడే, ఇందూరు: Induru Sharannavaratri Celebrations | భక్తితో దుర్గమ్మను కొలిస్తే ఆ తల్లి కరుణతో మన జీవితాన్నే మారుస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. ఇందూరులో(Nizamabad) శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
Induru Sharannavaratri Celebrations | పెద్దమ్మ ఆలయంలో భక్తుల సందడి..
నగరంలోని ముబారక్‌నగర్ పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయంలో బారులుదీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. అలాగే మాలధారణ గావించే భక్తులు వేద పండితలతో కంకణం కట్టించుకున్నారు. కంకణం కట్టుకున్న భక్తులు తొమ్మిదిరోజుల పాటు నిష్టతో ఉపవాసాలు చేస్తూ అమ్మవారిని కొలుస్తారు. నగరంలోని దేవిమందిర్లోనూ ఉదయంనుంచే భక్తులు అమ్మవారికి పూజలు చేశారు. అలాగే గంజ్‌లో కన్యకాపరమేశ్వరి ఆలయంలో సుహాసినులు పూజలు నిర్వహించారు.
Induru Sharannavaratri Celebrations | భక్తిశ్రద్ధలతో ‘దేవి ఆగమన్’కు ఏర్పాట్లు
నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో మండపాలను నెలకొల్పి దుర్గామాతను కొలుస్తారు. ఈ సందర్భంగా మండపాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మాజీ మేయర్ స్ట్రీట్‌లోని ఇంద్రాణి స్కూల్ వద్ద రోడ్డుపై ఏర్పాటు చేసిన మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయవాడ దుర్గమ్మ ఆలయం రీతిలో సెట్టింగ్ వేసిన నిర్వాహకులు.. భారీగా ఏర్పాట్లు చేశారు. రాత్రివేళ విద్యుత్ కాంతులతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.
ఇది కూడా చదవండి:ఆరేళ్ల చిన్నారి మృతి.. హైదరాబాద్‌లో విషాదం!