Jurala Water Release | జూరాల నుంచి నీటి విడుదల

జూరాల ప్రాజెక్ట్​ నుంచి నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jurala Water Release | రైతుల పోరాటం ఫలించింది. జూరాల ఆయకట్టు కింద సాగు అవుతున్న పంటలకు అధికారులు నీటి విడుదలను ప్రారంభించారు.

జూరాల ఆయకట్టు కింద రైతులు పంటలు సాగు చేశారు. అయితే వర్షాలు లేక అవి ఎండిపోతున్నాయి. మరోవైపు జూరాలలో నీరు ఉన్నా అధికారులు విడుదల చేయడం లేదు. దీంతో కొంతకాలంగా అన్నదాతలు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల వారే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్నారు. అనంతరం అధికారులు గేట్లు మూసివేశారు. దీంతో రైతులు ఆందోళన చేపట్టగా.. బీఆర్​ఎస్​, బీజేపీలు వారికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ ప్రభుత్వం దిగొచ్చి నీటి విడుదలకు అంగీకారం తెలిపింది.

Jurala Water Release | మంత్రి ఆదేశాల మేరకు..

మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) ఆదేశాల మేరకు అధికారులు బుధవారం ఉదయం నీటి విడుదలను ప్రారంభించారు. కుడి కాల్వ నుంచి 350 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 750 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జూరాలకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు మంగళవారం ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్​ను కలిశారు. నేడు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మరోసారి ఆయనతో భేటీ కానుంది. ఇవాళ జరిగే భేటీలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జూరాల ప్రాజెక్టుకు దశల వారీగా నీటిని విడుదల చేయాలని మంత్రులు కోరారు.

Jurala Water Release | పోరాడితే పోయేదేమీలేదు..

జూరాల నుంచి సాగునీటి విడుదలపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పోరాడితే పోయేదేమీ లేద.. బానిస సంకెళ్లు తప్పా అన్నారు. పొలాలు ఎండిపోతున్న తరుణంలో రైతులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. కుంభకర్ణ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana Heavy Rain | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *