Harish Rao Fire | రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ పాలన: హరీశ్​రావు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Fire | ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ నేత హరీశ్​ రావు విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను హరీశ్​రావు స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ (State Government) వైఫల్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షలాది మంది రైతులు ఇవాళ గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, లెక్కలేదన్నారు. యూరియా సరఫరా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం.. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Harish Rao Fire | వడ్లు కొనడం చేతకాక..

రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే.. నిన్నటి దాకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇవాళ 70 లక్షల టన్నులే కొంటామంటున్నారని హరీశ్​రావు పేర్కొన్నారు. మిగతా 70 లక్షల టన్నులు దళారులకు అమ్ముకోవాలా అని ప్రశ్నించారు. వడ్లు కొనడం చేతగాక కేంద్రం మీద నెపం నెడుతున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​ హయాంలో కేంద్రం కొనకున్నా, రైతులకు నష్టం కలగకుండా కేసీఆర్ (KCR) కొనుగోలు చేశారని గుర్తు చేశారు.

Harish Rao Fire | రైతు భరోసా ఏది

ముఖ్యమంత్రిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని హరీశ్​రావు ఆరోపించారు. క్యాబినెట్ మీటింగ్​లో రైతుల కష్టాల గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మార్చి 22న సిద్దిపేటకు వచ్చిన సీఎం 45 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా (Rythu Bharosa) వేస్తా అని సీఎం చెప్పారన్నారు. ఇవాళ్టికి 63 రోజులైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Phone Tapping Case|ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు..ఇవాళ ‘సిట్’ ముందుకు కాంగ్రెస్ నేత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *