Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం: మానాల మోహన్​ రెడ్డి

Shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్​: Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను కాంగ్రెస్​ ప్రభుత్వం నెరవేరుస్తోందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) అన్నారు. ఈ మేరకు సికింద్రాపూర్​లో లబ్ధిదారు మాలెపు అర్చన రాజు, బడా భీమ్​గల్​ శంకురి ప్రమీల, వేల్పూర్​ మండలంలోని పడగల్​లో మందల లింగుబాయి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Indiramma Housing Scheme | శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు..

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మానాల మోహన్​రెడ్డి తెలిపారు. భీమ్​గల్​ మండలంలో ఇప్పటికే 60శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి నివాసం కల్పించాలనే కృత నిశ్చయంతో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఉన్నారన్నారు. మరో నెల రోజుల్లో రెండో విడతలో 3,500 ఇళ్లకు మంజూరు రానుందన్నారు. కార్యక్రమంలో భీమ్​గల్​ మున్సిపల్ ఛైర్మన్ బొదిరే స్వామి, వైస్ ఛైర్మన్ జేజే నర్సయ్య, కౌన్సిలర్ నాగేంద్ర బాబు, సర్పంచ్​లు రమేష్, నరేందర్, రాజు, భూమారెడ్డి, సురేష్, ఉప సర్పంచ్ నరేందర్, మల్లారెడ్డి నరేష్, నితీష్, జలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: ACB Raids | బోధన్​ పోలీస్​ స్టేషన్​లో ఏసీబీ సోదాల కలకలం

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *