అక్షరటుడే వెబ్‌డెస్క్: WorldSkills 2026 India | చైనాలోని ( China )షాంఘై వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ‘వరల్డ్‌స్కిల్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ 2026’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు పిడిలైట్ మద్దతు ఇస్తున్న ఇద్దరు యువ నిపుణులు సిద్ధమయ్యారు. అడెసివ్‌లు, సీలెంట్‌లు, కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ప్రకాష్ సుతార్, పంకజ్ జంగ్రా అనే ఇద్దరు అభ్యర్థులను గ్లోబల్ వేదికకు పంపుతున్నట్లు గర్వంగా ప్రకటించింది. ఇండియాస్కిల్స్ 2026 జాతీయ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వీరు, పిడిలైట్ వుడ్‌వర్కింగ్ అండ్ ప్లంబింగ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్కిల్స్ (PWP)లో ప్రత్యేక శిక్షణ పొందారు.
WorldSkills 2026 India | నైపుణ్యాల పోరు..
ఈ నెల సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు చైనాలోని షాంఘైలో 48వ వరల్డ్‌స్కిల్స్ పోటీలు వైభవంగా జరగనున్నాయి. ఈ అంతర్జాతీయ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల నుంచి 1,400 మందికి పైగా యువ నిపుణులు హాజరవుతున్నారు. వీరంతా మొత్తం 64 వివిధ నైపుణ్య విభాగాలలో తమ ప్రతిభను చాటుకోనున్నారు.
WorldSkills 2026 India | అవసరాలకు తగిన శిక్షణ..
ఈ విజయంపై పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాన్షు వత్స మాట్లాడుతూ.. భారతదేశ ‘వికసిత్ భారత్’ (Viksit Bharat) లక్ష్యం నెరవేరాలంటే కేవలం భారీ మౌలిక వసతులు మాత్రమే కాకుండా, మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చగల నైపుణ్యం గల శ్రామిక శక్తి కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. నైపుణ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో పరిశ్రమల పాత్ర కీలకమని, ఇండియాస్కిల్స్ 2026లో తమ PWP శిక్షణ పొందిన అభ్యర్థులు సాధించిన విజయం తాము ఇస్తున్న శిక్షణ నాణ్యతను చాటుతోందని తెలిపారు.
WorldSkills 2026 India | భవిష్యత్ లక్ష్యాలు..
అహ్మదాబాద్‌లోని ‘కౌశల్య – ది స్కిల్ యూనివర్సిటీ’ భాగస్వామ్యంతో పిడిలైట్ వుడ్‌వర్కింగ్ అండ్ ప్లంబింగ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్కిల్స్ (PWP) ఏర్పాటైంది. చెక్క పని (Woodworking), ప్లంబింగ్ రంగాలలో యువతకు ఆధునిక, ఆచరణాత్మక శిక్షణను అందిస్తూ.. సంప్రదాయ నైపుణ్యాలకు, మారుతున్న పరిశ్రమ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం.
నైపుణ్యాభివృద్ధి రంగంలో పిడిలైట్ చేస్తున్న నిరంతర పెట్టుబడులు భవిష్యత్తుకు తగిన శ్రామిక శక్తిని తయారు చేయాలనే దాని దీర్ఘకాలిక నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆచరణాత్మక శిక్షణను అంతర్జాతీయ ప్రమాపులతో అనుసంధానం చేయడం ద్వారా, భారతదేశంలో హస్తకళల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు.. ప్రపంచ వేదికలపై భారతీయ ప్రతిభను చాటడమే లక్ష్యంగా పిడిలైట్ అడుగులు వేస్తోంది.
ఇది కూడా చదవండి: Inter Special Admissions | విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్లో ప్రత్యేక అడ్మిషన్లకు అవకాశం..