అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : Narsingpalli Suspicious Death | నర్సింగ్‌పల్లి శివారు గుట్టల్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు మోపాల్ పోలీసులు(Mopal Police) వివరాలు వెల్లడించారు.
Narsingpalli Suspicious Death | నర్సింగ్పల్లిలోని గంగమ్మ గుడి వెనక..
మోపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో గంగమ్మ గుడి వెనుక ఉన్న గుట్టపై షేక్ రాజీ సాబ్ (51) అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు 29న ఉదయం పేలాలు అమ్మేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 30వ తేదీన ఉదయం 8:45 గంటలకు నర్సింగ్‌పల్లి గ్రామ శివారులోని గుట్టపై ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడి ముఖం, తలపై గాయాలు ఉండటంతో పాటు, అతని వద్ద ఉన్న డబ్బులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు అందిన ఫిర్యాదు ఆధారంగా మోపాల్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Alert: హైదరాబాద్ లో భారీ వర్షం