అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Speed Rail | తెలంగాణకు ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. హైదరాబాద్ – పుణె, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై కారిడార్లపై చర్చించారు.
ఈ మూడు కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించలేదని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అలైన్‌మెంట్ ఆమోదించిన తర్వాత భూ సేకరణను ప్రారంభిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా అలైన్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కోరారు.
High Speed Rail | రైలు మార్గం మంజూరు చేయాలి
వికారాబాద్ – కృష్ణా కొత్త రైలు మార్గాన్ని (130 కి.మీ) మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. వికారాబాద్ జిల్లా టేకల్‌కోడ్ పరిసరాల్లో భారీ సున్నపురాయి నిక్షేపాలు బయటపడ్డాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని సిమెంట్, టెక్స్‌టైల్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ మార్గంలో రైల్వే లైన్ నిర్మించాలన్నారు. డోర్నకల్- గద్వాల్, కల్వకుర్తి – మాచర్ల, కాచిగూడ –జగ్గయ్యపేట (250 కి.మీ.), పటాన్‌చెరు – ఆదిలాబాద్ (320 కి.మీ.), బోధన్ – లాతూర్ (175 కి.మీ.), అక్కన్నపేట బైపాస్ లైన్ (8 కి.మీ.) మార్గాలను మంజూరు చేయాలన్నారు.
దీనిని కూడా చదవండి : Green Water Tankers | జలమండలి కీలక నిర్ణయం.. ఎల్లుండి నుంచి శుద్ధి చేసిన నీటి సరఫరా