అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prajavani Complaints | నగరంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో సహా అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
Prajavani Complaints | 89 ఫిర్యాదులు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత, జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Chimrajpalli Tungen Road | చింరాజ్‌పల్లి నుంచి తుంగెనకు డబుల్ రోడ్ వేయాలి..