అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vamsi Goud | తెలంగాణ భారత జనతా యువ మోర్చా (బీజీవైఎం) జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు ఆదేశాల మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే జిల్లా అధ్యక్షుల వివరాలను వెల్లడించారు.
Vamsi Goud | పార్టీ బలోపేతానికి..
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) అధ్యక్షుడిగా రత్నగారి వంశీ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జిల్లా అధ్యక్షుడిగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్కు, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డికి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా క్రమశిక్షణతో, అంకితభావంతో పని చేస్తానని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తానని రత్నగారి వంశీగౌడ్ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Dhanpal Suryanarayana | అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హౌస్ అరెస్ట్..