BRS Government | రాష్ట్రంలో వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే..: మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి

రాష్ట్రంలో వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: BRS Government | రాష్ట్రంలో ప్రతిగుండెలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నాడని, వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిచ్​పల్లిలో నిర్వహించారు.

BRS Government | కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే..

ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో  కార్యకర్తలు రావడం చూస్తే.. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే ఉందన్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారన్నారు. వరిధాన్యం కొనుగోలు చేయడానికి నెలల పాటు రోడ్లపై వడ్ల బస్తాలు పెట్టుకొని రైతులకు ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. యూరియా సంచులు తీసుకు వెళ్లాలంటే యాప్​లో మొదట గా బుక్ చేసుకోవాలని.. తర్వాత యూరియా కోసం లైన్​లో క్యూ కట్టాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు.

BRS Government | యూరియా యాప్​తో అనేక కష్టాలు..

దేశం మొత్తం ఈ యాప్ గురించి గొప్పగా చెపుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారని కానీ ఇక్కడ చూస్తే రైతులు ఫోన్లు పట్టుకొని యాప్​తో సతమతం అవుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) మాట్లాడుతూ.. తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్​ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు కూలిపోతే దాని రిపైర్ చేయించకుండా రచ్చ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత అని ఎద్దేవా చేశారు. ప్రజలందరి మనసులో ఎన్నికలు ఎపుడు వచ్చినా మళ్లీ కేసీఆర్​ను గెలిపించుకోవాలని ఆరాటపడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తోడుదొంగలేనని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Guptha), జీవన్ రెడ్డి, హనుమంతు షిండే, జాజాల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

brs1

ఇది కూడా చదవండి: Meenakshi Natarajan Nomination | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు​ షాక్​.. మీనాక్షి నటరాజన్​ నామినేషన్​ తిరస్కరణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *