Dichpally Police Station | డిచ్​పల్లి పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

డిచ్​పల్లి పోలీస్ స్టేషన్​ను సీపీ సాయి చైతన్య గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally Police Station | డిచ్​పల్లి పోలీస్ స్టేషన్​ను సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

Dichpally Police Station |  ప్రజలను అప్రమత్తం చేయాలి

పోలీస్​స్టేషన్​లోని రిసిప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును, 5ఎస్ అమలు విధానాన్ని సీపీ అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. గంజాయికి ఎవరైన బానిస అయితే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, గేమింగ్ యాప్​ల కారణంగా కలిగే దుష్ప్రరిణామాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ యాదవ్, డిచ్​పల్లి సీఐ వినోద్, కె. వినోద్, ఎస్సై ఆరిఫ్ ఉన్నారు.

ఇది కూడా చదవండి: పాకిస్థాన్‌లో రామాయణం క్రేజ్.. కరాచీలో జై శ్రీరామ్ నినాదాలు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *