Mancherial Police | మద్యం మత్తులో.. కారుతో పోలీసుల బీభత్సం!

రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీని పోలీస్​ సిబ్బంది కారు ఢీకొంది. ఆ సమయంలో వారు మద్యం తాగి ఉన్నట్లు సమాచారం.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mancherial Police | మద్యం తాగి వాహనాలు నడుపొద్దని పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తుంటారు. ఎవరైనా తాగి డ్రైవింగ్​ చేస్తూ దొరికితే కోర్టులో హాజరు పరుస్తారు. అలాంటి పోలీసులే మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించారు. ఓ వాహనాన్ని ఢీకొని, బాధితుడినే బెదిరించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా (Mancherial District)లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాసిపేట మండల కేంద్రంలో పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దేవాపూర్ ఠాణాకు చెందిన కానిస్టేబుళ్లు, హోంగార్డు మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రాలీని ఢీకొట్టినట్లు సమాచారం. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొనడంతో ట్రాలీ దెబ్బతిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్​ కారు కూడా ధ్వంసమైందని, అయితే ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు.

Mancherial Police | బెదిరించడంతో..

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీస్​ సిబ్బందిని నిలదీశారు. దీంతో పరిహారం చెల్లిస్తామని వారు చెప్పడంతో అంతా ఊరుకున్నారు. అయితే తర్వాత పరిహారం ఇవ్వాలని ట్రాలీ యజమాని సాగర్​ అడగ్గా పోలీసులు బెదిరించినట్లు సమాచారం. దీంతో బాధితుడు శుక్రవారం రాత్రి కాసిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తొలుత పరిహారం చెల్లిస్తామని చెప్పి వెళ్లిపోయారని, తర్వాత రోజు మాట మార్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఇది కూడా చదవండి..: Telangana Phone Tapping Case | త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ముగింపు : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *