Telangana Phone Tapping Case | త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ముగింపు : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై 2024 మార్చిలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Phone Tapping Case | తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లోని టీజీఐఆర్‌డీ (TGIRD) బోధి పెవిలియన్‌లో శుక్రవారం (నవంబర్ 13) మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ఈ కేసు విచారణ త్వరలోనే ముగియనుందని వెల్లడించారు. విచారణ పూర్తయిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

Telangana Phone Tapping Case | తన ఫోన్‌ ఎవరైనా ఏదైనా వినవచ్చు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ MODI తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. “మీ ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతోందా?” అని మీడియా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. తన ఫోన్ ట్యాపింగ్ చేసినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తన ఫోన్‌ ఎవరైనా ఏదైనా వినవచ్చని వ్యాఖ్యానించారు.

Telangana Phone Tapping Case | పొలిటికల్ కారిడార్లలో చర్చ

ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు తదితరులపై ఆరోపణలు, విచారణ అంశాల నేపథ్యంలో.. తుది నివేదికలో ఎలాంటి అంశాలు బయటకు రాబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Telangana Phone Tapping Case | 2024 మార్చిలో నమోదైన కేసు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) ద్వారా ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై 2024 మార్చిలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా గతంలో సీనియర్ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్టు చేయగా, తదనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు.

Telangana Phone Tapping Case | తుది దశలో చార్జిషీట్

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేశారు. విచారణ ప్రక్రియ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తుది చార్జిషీట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మొత్తానికి, విచారణ ముగింపు దశకు చేరుకుందన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో రానున్న రోజుల్లో ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *