Dinesh Kulachari | ఎంపీ అర్వింద్​పై వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : దినేష్​ కులాచారి

గాంధీభవన్​ వేదికగా అర్వింద్​పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Dinesh Kulachari | గాంధీభవన్​లో ఎంపీ అర్వింద్​పై(MP Arvind) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా (Nizamabad) అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు.

Dinesh Kulachari | స్థాయి తక్కువ వాళ్లతో మాట్లాడిస్తారా..!

గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ సాయికుమార్ ఎంపీ అర్వింద్​పై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని దినేష్​ పేర్కొన్నారు. అర్వింద్ సీఎం రేవంత్ రెడ్డి లాగా బ్రోకర్, బ్లాక్ మెయిలర్ కాదన్నారు. ఓట్ల కోసం నోట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన చరిత్ర అర్వింద్​ది కాదని స్పష్టం చేశారు.

Dinesh Kulachari | పార్లమెంట్​లో గళమెత్తి..

తెలంగాణ గొంతుకగా ప్రజల మద్దతుతో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన నాయకుడు అర్వింద్​ అని దినేష్​ పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టిన ఘనత ఆయనదన్నారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి స్వయంగా నిలబెట్టిన జీవన్ రెడ్డిని సైతం మట్టికరిపించి రెండోసారి ఘన విజయం సాధించారన్నారు. ఇందూరు జిల్లాలో సుమారు 100 మంది సర్పంచులను, ఇద్దరు ఎమ్మెల్యేలను, అలాగే రెండుసార్లు 28 మంది కార్పొరేటర్లను గెలిపించుకున్న ప్రజాబలం ఉన్న నాయకుడిపై ఒక చిల్లర వ్యక్తితో ఆరోపణలు చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dinesh Kulachari | అర్వింద్​ నైజం అదికాదు..

రేవంత్ రెడ్డి లాగా చిల్లర ఆరోపణలు చేయడం, అన్-పార్లమెంటరీ భాష మాట్లాడటం అర్వింద్​ నైజం కాదని దినేష్​ పేర్కొన్నారు. గాంధీభవన్ లో సాయికుమార్ మాట్లాడిన మాటలకు, స్వయంగా అక్కడున్న కాంగ్రెస్ నాయకులే సిగ్గుతో తలదించుకున్నారన్నారు. ఎంపీ అర్వింద్​పైచేసిన వ్యాఖ్యలకు గాను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. చిల్లర వ్యాఖ్యలు చేసిన సాయికుమార్​ను ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుండి తక్షణమే తొలగించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి భూస్థాపితం చేసేది అర్వింద్ అని తెలిసే ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంతో మాజీ సీఎం కేసీఆర్​ అర్వింద్​తో పెట్టుకుని ఫాంహౌజ్​కు పరిమితం అయ్యారని.. అదే గతి రేవంత్​రెడ్డికి కూడా పడుతుందని స్పష్టం చేశారు.

Dharmapuri Arvind

ఇది కూడా చదవండి: Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *