Agni 4 Missile | అగ్ని–4 క్షిపణి పరీక్ష విజయవంతం

ఒడిశాలోని చండీపూర్​లో గురువారం అగ్ని-4 క్షిపణిని అధికారులు విజయవంతంగా పరీక్షించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Agni 4 Missile | రక్షణ రంగంలో భారత్​ మరో మైలురాయిని చేరుకుంది. మధ్య శ్రేణి రకానికి చెందిన అగ్ని–4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

ఒడిశా (Odisha)లోని చండీపూర్​లో గురువారం సాయంత్రం ITR నుంచి అగ్ని-4 క్షిపణి ప్రయోగం చేశారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో పరీక్ష చేపట్టగా.. వివజయవంతం అయింది. ఈ ప్రయోగ సమయంలో భారత్ 3000 కి.మీ.పైగా NOTAM ఆంక్షలు విధించింది. మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-4’ను చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం అన్ని కార్యాచరణ, సాంకేతిక పారామితులను ధృవీకరించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Agni 4 Missile | 4 వేల కి.మీ. రేంజ్​

అగ్ని-4 ఘన-ఇంధన రాకెట్ మోటార్ ద్వారా నడిచే రెండు-దశల, సర్ఫేస్​ టు సర్ఫేస్​ క్షిపణి. ఇది 4,000 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశం అగ్ని-ప్రైమ్, అగ్ని-3 క్షిపణుల పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. తాజాగా అగ్ని–4 మిసైళ్లను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో భారత అమ్ముల పొదిలో త్వరలో ఇది చేరనుంది.

దీనిని కూడా చదవండి : Mohan Bhagwat Gen Z | వాళ్లు దేశ వ్యతిరేకులు కారు.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *