అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Ganja Smuggling | నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు (Nizamabad Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆరో టౌన్ ఎస్సై సందీప్ గురువారం వివరాలు వెల్లడించారు.
Ganja Smuggling | నెహ్రూనగర్‌లో..
నగరంలోని ఆరో పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్ శివారులో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు నాందేడ్‌లో గంజాయి ప్యాకెట్లు కొని నిజామాబాద్ శివార్లలో విక్రయిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. వారి వద్ద నుంచి 60గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం (Cannabis Seizure) చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఎస్సై నారాయణ సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్