Private Schools Notice | రెండు ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు.. పాఠ్యపుస్తకాల గది సీజ్​

పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న రెండు స్కూళ్లకు విద్యాశాఖాధికారులు నోటీసులు అందించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Private Schools Notice | పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న రెండు స్కూళ్లకు విద్యాశాఖాధికారులు నోటీసులు అందించారు. ప్రజావాణి (Prajavani)లో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు.

Private Schools Notice | ఆలూర్​ మండలంలోని కల్లడి గ్రామంలో..

ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు ఆలూరు ఎంఈవో నరేందర్ బుధవారం ఆలూర్ మండల (Aloor Mandal) పరిధిలోని కల్లడి గ్రామంలో ఉన్న హోవర్డ్ పార్క్, వాగ్దేవి ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా హోవర్డ్ పార్క్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఎంఈఓ, పాఠ్యపుస్తకాల నిల్వ గదికి సీల్ వేసి యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. అలాగే శిక్షణ లేని ఉపాధ్యాయులతో బోధన నిర్వహిస్తున్నట్లు గుర్తించి, వెంటనే అర్హత కలిగిన శిక్షణ పొందిన ఉపాధ్యాయులతోనే తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హోవర్డ్ పార్క్, వాగ్దేవి పాఠశాల యాజమాన్యాలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన ఎంఈవో, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు విద్యా బోధన, నిర్వహణ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Education Bandh | విద్యను కార్పొరేటీకరణ చేసే యోచనలో బీజేపీ ప్రభుత్వం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *