అక్షరటుడే, కామారెడ్డి: Social Media Defamation | తనపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad)లో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ గద్వాల విజయలక్ష్మికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Social Media Defamation | ‘కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఫేస్బుక్’లో..
ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున సుమారు రెండు గంటలకు ‘కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఫేస్బుక్’ పేజీలో షేక్ ముక్తార్ అనే వ్యక్తి తనను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారన్నారు. అసభ్యకరమైన, అవమానకరమైన, లైంగిక భావాలతో కూడిన పోస్టును అప్లోడ్ చేశాడని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆ పోస్టులో తన పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా తనను సామాజికంగా కించపర్చే ఉద్దేశంతో ప్రచారం జరుగుతోందని ఇందుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో తనకున్న గౌరవం, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదుగుదలను సహించలేక మహమ్మద్ ఇషాక్ షేరు, అంజద్, పర్వేజ్ హైమద్, చాట్ల రాజేశ్వర్, గుడుగుల శ్రీనివాస్, ఇర్ఫాన్, కైఫ్, సుచితాన్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ పోస్టులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో పాటు మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని కమిషన్ ఛైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి..: Urea App Cancellation | యూరియా యాప్ను రద్దు చేయాల్సిందే..