అక్షరటుడే, డిచ్పల్లి: Dichpally Battalion | డిచ్పల్లి (Dichpally) ఏడో బెటాలియన్ నూతన కమాండెంట్‌గా బి. సీతారాం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
బెటాలియన్‌లో క్రమశిక్షణ..
బెటాలియన్ క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజలకు మెరుగైన సేవలందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమాండెంట్ సీతారాం పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు సంస్థ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. బెటాలియన్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోందని.. దీనిని మరింత పెంచేందుకు కృషి చేద్దామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Honda త్వరలో మార్కెట్లోకి కొత్త ఈవీ + స్కూటర్..!