Nizamabad Power Cut | 15న నగరంలో విద్యుత్​ సరఫరాలో అంతరాయం

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Power Cut | నగరంలో ఆదివారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్​ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ట్రాన్స్​కో టౌన్​–3 ఏడీఈ వినోద్​ తెలిపారు. శనివారం ప్రకటన విడుదల చేశారు.

Nizamabad Power Cut | వినాయక్ నగర్​ పరిధిలోని..

నగరం (Nizamabad)లోని వినాయక్​నగర్​ పరిధిలో 15వ తేదీ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని 11కేవీ వినాయక నగర్–2 ఫీడర్​పై అలాగే ఆర్యనగర్–2 ఫీడర్స్ టవర్స్​ పనులు జరుగుతున్నాయని ట్రాన్స్​కో ఏడీఈ ​ తెలిపారు. ఈ సందర్భంగా 11 కేవీ ఆర్యనగర్ 2 ఫీడర్​ పరిధిలోని విశాల్ మార్ట్ ఏరియా, ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏరియా, జాకీ షోరూం, చికెన్ సెంటర్ ఏరియా, రామరాజ్​ కాటన్​ ఏరియాల్లో కరెంట్​ ఉండదన్నారు. అలాగే 11 కేవీ వినాయక నగర్–2 పరిధిలోని అగర్వాల్ హాస్పిటల్, పులాంగ్ హనుమాన్ ఆలయం ఏరియాలో విద్యుత్​ సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Madapur Bhu Bharati Resurvey | మాదాపూర్‌లో భూభారతి రీ-సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్…

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *