అక్షరటుడే, వెబ్‌డెస్క్: Microsoft Global Outage | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) పలు సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. 36 గంటల తర్వాత సంస్థ సమస్యను పరిష్కరించి సేవలను పునరుద్ధరించింది. ఈ అంతరాయంపై కంపెనీ క్షమాపణలు కోరింది.
మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్, టీమ్స్, కోపైలెట్ సేవలు 36 గంటలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. Microsoft 365 సమస్యను ఇప్పుడు పరిష్కరించినట్లు సంస్థ తెలిపింది. ఈ అంతరాయం కనీసం 74 దేశాల్లోని వినియోగదారులను ప్రభావితం చేసింది. దీంతో వ్యాపారాలు, ప్రభుత్వాలు, ఆసుపత్రులు, విమానయాన సంస్థలు ఫోన్ లైన్లు, కాగితపు రికార్డులు, కొన్ని కార్యాలయాల్లో ఫ్యాక్స్ మెషీన్లపై ఆధారపడవలసి వచ్చింది.
Microsoft Global Outage | నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌తో..
అవుట్‌లుక్ అంతరాయానికి నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ కారణమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఎలాంటి సైబర్ దాడి జరగలేదని స్పష్టం చేసింది. కాగా ఈ అంతరాయంలో భారత్‌లోని ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థల కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది.
ఇది కూడా చదవండి..: Sam Pitroda | మోదీ అలా చేయరు.. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు