అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bodhan Bar License | బోధన్ పట్టణంలో (bodhan) నూతనంగా మంజూరైన బార్ కోసం శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు. కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Bodhan Bar License | ఒక బార్‌కు 19 దరఖాస్తులు..
బార్ లైసెన్సు కోసం మొత్తం 19 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీసి బార్ కేటాయింపు కోసం లైసెన్స్ ఖరారు చేశారు. లక్కీడ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, సూపరింటెండెంట్ నందగోపాల్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బోధన్ ఎక్సైజ్ సీఐ భాస్కర్ తదితర అధికారులు లక్కీ డ్రా నిర్వహణ ప్రక్రియలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో మార్పులు.. పెట్రోల్, డీజిల్ ధరలు మారుతాయా?